తల్లిని గెంటేసిన ఘటనపై SHRC స్పందన

తల్లిని గెంటేసిన ఘటనపై SHRC స్పందన

TG: నల్గొండ జిల్లాలో ఆస్తి మొత్తాన్ని సమానంగా పంచుకుని తల్లిని బయటకు గెంటేసిన ఘటనపై SHRC స్పందించింది. కుమారుల చర్యలను తప్పబట్టిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించారు. ఈ ఘటనలో వాస్తవ పరిస్థితి, తీసుకున్న చర్యలపై ఏప్రిల్ 6లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆ తల్లి ప్రస్తుతం కుమార్తె వద్ద ఉన్నట్లు సమాచారం.