VIDEO: అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు: ఎమ్మెల్యే

VIDEO: అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు: ఎమ్మెల్యే

BPT: కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయొద్దని హెచ్చరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖాధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కారమయ్యే విధంగా చూస్తామన్నారు.