ట్రాఫిక్ సమస్యపై సబ్ కలెక్టర్‌కు వినతి

ట్రాఫిక్ సమస్యపై సబ్ కలెక్టర్‌కు వినతి

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ అపెక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శనివారం సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణికి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు పాత్రికేయులతో వారు మాట్లాడుతూ.. రోడ్లపై ఆక్రమణలు తొలగించాలన్నారు. కాగా, పలుచోట్ల విస్తరణ పనులు చేపట్టాలన్నారు. అనంతరం అలాగే డివైడర్లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా లైన్స్ వేయాలని కోరారు.