ఏకగ్రీవ సర్పంచ్ కోసం రూ. 30 లక్షల ఆఫర్

ఏకగ్రీవ సర్పంచ్ కోసం రూ. 30 లక్షల ఆఫర్

వికారాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెద్దేముల్ మండలం నాగులపల్లికి చెందిన యువకుడు యాదవ రెడ్డి ఆఫర్ ఇచ్చారు. తనను ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ. 30 లక్షలు కేటాయిస్తానని ప్రకటించారు. ఇందులో రూ.10 లక్షలు హనుమాన్ మందిరానికి, అలాగే మైనారిటీ, క్రిస్టియన్ వెల్ఫేర్ కోసం మొత్తం రూ. 6 లక్షలు, రూ. 2 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్‌కు ఇస్తానని తెలిపారు.