పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు

ATP: కంబదూరు మండలం నూతిమడుగు గ్రామ శివారులో పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఎస్సై లోకేష్ మాట్లాడుతూ.. పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. 5 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 8500 నగదు పెకమొక్కలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.