ఔదార్యాన్ని చాటుకున్న పాఠశాల మిత్రులు

JGL: వెల్గటూర్ జడ్పీ ఉన్నత పాఠశాల 2008- 09 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తోటి స్నేహితురాలికి ఆర్థిక సాయం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన తమ స్నేహితురాలి భర్త ఇటీవల మృతి చెందారు. కాగా, తోటి మిత్రులు రూ. 35 వేలు జమచేసి స్నేహితురాలి కూతురు పేరిట పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.