కోహ్లీ సపోర్ట్‌గా నిలిచాడు: యశ్ తండ్రి

విరాట్ కోహ్లీపై యశ్ దయాళ్ తండ్రి చందర్‌పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యశ్‌ను కోహ్లీ చాలా ప్రోత్సహించినట్లు తెలిపాడు. RCBలో యశ్ చేరాక.. తరచూ అతడికి ఫోన్ చేసేవాడని చెప్పాడు. ఒక్కోసారి యశ్ రూమ్‌కు వెళ్లిపోయేవాడని చెప్పుకొచ్చాడు. 2024 సీజన్ గురించి తీవ్రంగా చర్చించేవారని.. శ్రమిస్తూనే ఉండమని సూచనలిచ్చేవాడని వెల్లడించాడు.