మాజీ మంత్రి నివాసంలో ఈడీ సోదాలు

ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కుంభకోణానికి సంబంధించి ఈడీ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీలోని సౌరభ్ భరద్వాజ్ నివాసంతో పాటు మరో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.