శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు సర్వీసు

శ్రీకాకుళం నుంచి తిరుపతికి  రైలు సర్వీసు

శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీసు మంజూరైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రకటనల్లో తెలిపారు. హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుందని రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్ నుంచి ప్రయాణిస్తుందన్నారు.