'హెల్ప్‌లైన్ ద్వారా అభ్యర్థులకు సేవలు అందించాలి'
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని నారక్కపేట 2 విడత సర్పంచ్‌ల నామినేషన్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేసి అభ్యర్థులకు సహాయం అందించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.