గర్భిణీలకు ప్రత్యేక వైద్య శిబిరం

గర్భిణీలకు ప్రత్యేక వైద్య శిబిరం

ASR: ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్‌లో భాగంగా అడ్డతీగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ బీ. బేబీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 52 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 19 మంది అనీమియాతో ఉన్నట్లు గుర్తించి, వారికి అవసరమైన మందులు అందజేశారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.