క్రీడా పాఠశాలలో పలువురు విద్యార్థుల ఎంపిక
NRML: క్రీడా పాఠశాలలో ప్రవేశం కోసం రాష్ట్రస్థాయి పోటీలకు పలువురు విద్యార్థులు ఎంపికైనట్లు డీవైస్‌వో శ్రీకాంత్ రెడ్డి శనివారం తెలిపారు. బాలికల విభాగంలో హిషిక, మధుప్రియ, స్నేహ, ధనశ్రీ, శాన్విత, లోహిత, స్నేహిత, బాలుర విభాగంలో హర్షిత్, అయాన్ తదితరులు ఎంపికయ్యారని వీరు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 25లోగా కలెక్టరేట్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.