VIDEO: ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన మహిళా రైతు

KMR: భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఓ మహిళా రైతు ఎమ్మెల్యే మదన్ మోహన్ కాళ్లు మొక్కారు. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం చిన్నూర్ నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యేను కలిసిన మహిళా రైతులు తమను ఆదుకోవాలని వేడుకున్నారు. అనంతరం తాను నిద్రహారాలు మాని వరద నష్టంపై సమీక్షిస్తున్నామన్నారు.