నాటక రంగ దిగ్గజం పతివాడ: మాజీ ఎమ్మెల్యే

నాటక రంగ దిగ్గజం పతివాడ: మాజీ ఎమ్మెల్యే

E.G: నాటక రంగాన్ని సుసంపన్నం చేసిన మహోన్నత వ్యక్తి దివంగత పతివాడ సూర్య నారాయణ అని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశ రావు కొనియాడారు. ఆదివారం రాజమండ్రిలోని ప్రకాశం నగర్‌లోని కమ్యూనిటి హాలులో జరిగిన సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పతివాడ రాజమండ్రి నాటక రంగ చరిత్రను గ్రంథస్థం చేసి, భావి తరాలకు గొప్ప సాహిత్య స్ఫూర్తిని అందించారని రౌతు పేర్కొన్నారు.