VIDEO: సమస్యల పంచాయితీ.. పట్టించుకోని అధికారులు
కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలులో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పన్నులు చెల్లించినప్పటికీ స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో నమోదు చేయాలని కోరినా.. స్పందన లేదని ఆరోపిస్తున్నారు. వీధి లైట్లు ఏర్పాటు చేయాలని PGRSలో ఫిర్యాదులు చేసినా పరిష్కారం లేకుండా పిటిషన్లు మూసివేస్తున్నారని విమర్శిస్తున్నారు.