బస్సు దిగుతూ టైర్ కింద పడ్డ ప్రయాణికుడు.. కాలు మీద నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు

బస్సు దిగుతూ టైర్ కింద పడ్డ ప్రయాణికుడు.. కాలు మీద  నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నుండి కోదాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు. ప్రయాణికుడు బస్సు దిగుతూ కిందపడి అతని కాలు మీద నుంచి వెనుక టైరు వెళ్లడంతో కాలు నుజ్జు నుజ్జు అయిన ఘటన గురువారం సూర్యాపేట బస్టాండులో చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు గమనించి అతనిని అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.