తిరుమలలో అపశృతి.. భక్తురాలికి గాయాలు
TPT: తిరుమలలో అపశృతి చోటుచేసుకుంది. అభిలాండ దీపం వద్ద ఓ భక్తురాలు దీపం వెలిగిస్తుండగా దుస్తులకు నిప్పు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఆమెను వెంటనే అప్రమత్తమైన తోటి భక్తులు మంటలను ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.