'భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి'
AKP: మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని సీఐటీయూ నాయకులు ఈరెల్లి చిరంజీవి డిమాండ్ చేశారు. ఈ మేరకు చెట్టుపల్లిలో మధ్యాహ్నా భోజన కార్మికులతో శుక్రవారం సమావేశమయ్యారు. మధ్యాహ్నా భోజన కార్మికులను తీసేసి స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.