పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు

నాగర్ కర్నూల్ డిపో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈనెల 19న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారామం, తిరుపతి, విజయవాడ కనకదుర్గ, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను సందర్శిస్తుందని చెప్పారు. వివరాలకు 94904 11590, 94904 11591 ఫోన్ చేయాలన్నారు.