బీజేపీని ఓడించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రచారం

బీజేపీని ఓడించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ  ప్రచారం

NZB: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కోరుతూ సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని నిజాం కాలనీ, సన కాలనీ, లతీఫ్ కాలనిలో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఇందులో నీలం సాయిబాబా, జన్నారపు రాజేశ్వర్, శివకుమార్, జెల్ల మురళి తదితరులు పాల్గొన్నారు.