‘ప్రేక్షకుల స్పందనే నా ఏడేళ్ల కష్టానికి ప్రతిఫలం’
దర్శకుడు నితేష్ తివారీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ కోసం ఏడేళ్లుగా ఎంతో శ్రమించినట్లు వెల్లడించాడు. సినిమా మేకింగ్ అనేది చాలా సుదీర్ఘమైన, ఒంటరి ప్రయాణమని.. ప్రతి క్షణం ప్రేక్షకుల స్పందన కోసమే ఎదురుచూశానని భావోద్వేగంతో చెప్పాడు. తాజాగా విడుదలైన టీజర్‌కు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూశాక, తన ఏడేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు.