ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

VSP: ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుంచి జింకలు తరచుగా రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జింక రోడ్డుపైకి ఆకస్మికంగా రావడంతో, అటుగా వస్తున్న బస్సు ఢీకొంది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ అడవి నుంచి ఇలా రోడ్డెక్కిన జింకలు తరచుగా ప్రమాదాలకు గురై, తీవ్ర గాయాలు లేదా మరణం సంభవిస్తున్నాయి.