సింగరేణి ఓసీ-2లో ప్రమాదం.. ఒకరు మృతి
TG: భద్రాద్రిలోని మణుగూరు సింగరేణి ఓసీ-2లో ప్రమాదం జరిగింది. VPR కంపెనీలో టిప్పర్ టైరు పేలి ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.