వైసీపీ నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ
NLR: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ YCP ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ పాల్గొని VRC కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ మెడికల్ కళాశాలలన్నిటిని వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పనంగా కారు చౌకగా కట్టబెట్టారని మండిపడ్డారు.