ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
VZM: గజపతినగరంలోని టీడీపీ నాయకులు లక్ష్మనాయుడు స్వగృహం వద్ద మంగళవారం గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాయుడు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.