'డయల్ యువర్ ఎస్పీ' ఫిర్యాదుకు స్పందన

'డయల్ యువర్ ఎస్పీ' ఫిర్యాదుకు స్పందన

NRPT: 'డయల్ యువర్ ఎస్పీ' కార్యక్రమంలో మరికల్ మండలం తీలేరుకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా విన్నవించారు. తీలేరు నుంచి మరికల్ ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లకు రేడియం స్టిక్కర్లు లేకపోవడం వల్ల రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ స్పందించి, వెంటనే ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.