ప్రత్యేక అలంకరణలో ఆంజనేయుడు దర్శనం

ATP: డి హీరేహాళ్ మండలం మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడికి శ్రావణమాసం నాలుగో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామునే స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి స్వామి మూలవిరాట్‌ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. శ్రావణమాసం సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు ఆలయానికి పోటెత్తారు.