ఈనెల 10న ఏలూరుకు కేంద్ర బృందం
ELR: మొంథా తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర బృందం ఈనెల 10న ఏలూరు జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు బృందం ఉంగుటూరు చేరుకుంటుందన్నారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి, పునరుద్ధరణ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సమీక్షిస్తుందని ఆమె పేర్కొన్నారు.