VIDEO: మహమూదిపట్నంలో కాంగ్రెస్–బీఆర్ఎస్ ఘర్షణ
MHBD: కేసముద్రం మండలం మహమూదిపట్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తన ఓటమికి కారణమంటూ ఓ బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ కార్యకర్తపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొనగా, బాధిత కాంగ్రెస్ నాయకుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.