శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

TPT: సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు శ్రీవారి ఆలయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ ఆయన వెంట ఉన్నారు.