పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ హెచ్చరిక

పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ హెచ్చరిక

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని పొరుగుదేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్ర చర్యలపై గతంలో దీటుగా బదులిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తవుతున్న వేళ రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.