'అనుమతులున్నా నోటీసులు ఇవ్వడం తగదు'

అనంతపురంలోని నగరపాలక అధికారి కార్యాలయంలో సోమవారం కమిషనర్ బాలస్వామికి ఎరుకల వీధి స్థానికులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఇసాక్ మాట్లాడుతూ..స్థానికంగా 50ఏళ్ల నుంచి ఎరుకల వీధిలో నివాసముంటున్నామన్నారు. స్థానిక కుటుంబాలకు పట్టాలతో పాటు, హౌస్ టాక్స్, వాటర్ టాక్స్, కరెంట్ బిల్ వంటి ప్రభుత్వ అనుమతులు ఉన్నా నోటీసులు ఇవ్వడం తగదు అన్నారు.