VIDEO: రాజీమార్గమే రాజమార్గం: జడ్జి నాగశైలజ
ELR: నూజివీడు కోర్టు సముదాయంలో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేయకుండా రాజీమార్గంతోనే వివాదాలు పరిష్కరించుకోవాలని 15వ జిల్లా అదనపు జడ్జి ఏ. నాగశైలజ సూచించారు. రాజీకి వీలున్న కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించారు.