దారుణం.. రాళ్లతో కొట్టి చంపేశారు!

దారుణం.. రాళ్లతో కొట్టి చంపేశారు!

AP: గుంటూరు జిల్లా తాడికొండలో దారుణం చోటుచేసుకుంది. తమ బంధువుపై దాడిచేశాడంటూ మరియదాసు అనే వ్యక్తిని నలుగురు రాళ్లతో కొట్టి చంపేశారు. మద్యం దుకాణంలో రమేష్‌తో గొడవపడగా.. మరియదాసు బీర్ సీసాతో దాడిచేశాడు. దీనిపై రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. అంతలో అతని బంధువులు మరియదాసుపై రాళ్లతో దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.