'మౌలిక సదుపాయాల గ్రౌండింగ్ త్వరితగతిన పూర్తి చేయాలి'

KNR: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెటర్నరీ ఉప కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఇదివరకే మంజూరైన మౌలిక సదుపాయాల పనులకు సంబంధించి గ్రౌండింగ్ వర్క్ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో అన్ని శాఖల హెచ్ఓడీలు, ఎంపీడీవోలతో సమావేశం ఏర్పాటు చేశారు.