నాగావళి నదిలో యువకుడు గల్లంతు
SKLM: శ్రీకాకుళంలోని మహిళా మండలి వీధికి చెందిన యు.ఉదయ్ ఆదివారం స్నేహితులతో కలిసి నాగావళి నదిలో స్నానానికి వెళ్లాడు. ఈ క్రమంలో వరద తాకిడికి నలుగురూ కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి ముగ్గురిని రక్షించగా ఉదయ్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్సై రామారావు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.