నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MDK: చేగుంట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ ఆదయ్య తెలిపారు. 132kv విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 33 కేవీ బోనాల ఫీడర్ పరిధిలోని గొల్లపల్లి, కన్యారం, రాంసాగర్, కర్నాల్ పల్లి, చిన్న శివునూర్ గ్రామాల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.