VIDEO: వైభవంగా అయ్యప్ప స్వామి శోభయాత్ర
SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ప్రతి నూతన సంవత్సరం రోజు అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని మండల కేంద్రంలోని పురవీధుల గుండా ఊరేగిస్తారు. ఈ సందర్భంగా మహిళలు స్వామివారికి మంగళహారతులు ఇచ్చారు. స్వామివారిని ప్రత్యేక వాహనంలో అలంకరించి శివాలయం నుంచి అయ్యప్ప టెంపుల్ వరకు ఊరేగించారు.