గ్యాస్ సిలిండర్ల పేరుతో కొత్త మోసాలు..!

గ్యాస్ సిలిండర్ల పేరుతో కొత్త మోసాలు..!

ADB: వంట గ్యాస్ కొరతను అడుగా పెట్టుకుని కొందరు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోని విశ్రాంత పోలీసు అధికారి లింగారెడ్డి ఇంటికి ఓ దుండగుడు వచ్చి మీరు గ్యాస్ బుక్ చేశారు కదా, గ్యాస్ సిలిండర్ల వాహనం చెడిపోయి ఆగిపోయింది అన్నాడు. రూ. 1000, ఆటోకు రూ.100, గ్యాస్ పాస్ బుక్ ఇస్తే గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి డబ్బులతో పరారయ్యాడు.