ఎస్పీ నిర్వహించిన ప్రజా వేదికకు 80 ఫిర్యాదులు

ప్రకాశం: బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన 80 ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ, పోలీస్ అధికారులు స్వీకరించారు. అనంతరం వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదులను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.