కల్తీ అల్లం పేస్ట్ యూనిట్‌పై పోలీసుల నిఘా

కల్తీ అల్లం పేస్ట్ యూనిట్‌పై పోలీసుల నిఘా

SRD: పటాన్ చెరువు మండలం శాంతినగర్ కాలనీలో అస్లాం అనే వ్యక్తి కల్తీ అల్లం పేస్ట్ యూనిట్ నడిపిస్తున్నట్లు సమాచారం అందిందని CI వినాయక్ రెడ్డి తెలిపారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ మౌనికకు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన కల్తీ అల్లం పేస్ట్ యూనిట్‌ను పరిశీలించి శాంపిల్స్‌ను సేకరించామని తెలిపారు. రిపోర్టులో అల్లం పేస్ట్ కల్తీ అని తెలిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.