VIDEO: రైతుల నిరసనలో అరుదైన దృశ్యం
సిమ్లాలో వందలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తుండగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. నిరసన జరుగుతుండగా భారత సైన్యానికి చెందిన ఓ ట్రక్కు అక్కడికి చేరుకుంది. ట్రక్కును చూడగానే, రైతన్నలు తక్షణమే నిరసనను ఆపి, క్రమశిక్షణతో పక్కకు తప్పుకుని వాహనానికి దారి ఇచ్చారు. తమ కష్టాల్లోనూ దేశ రక్షకుల పట్ల వారి అపారమైన అభిమానం 'జై జవాన్ - జై కిసాన్' నినాదానికి నిలువుటద్దంలా నిలిచింది.