ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
BDK: అశ్వారావుపేట పట్టణం BSR నగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇవి ఉండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు కంచెలు లేకపోవడం, ట్రాన్స్ ఫార్మర్లు నేలకు దగ్గరగా ఉండడం పెద్ద సమస్యగా మారింది. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.