భీమేశ్వరాలయంలో కార్తీక మహోత్సవం

భీమేశ్వరాలయంలో కార్తీక మహోత్సవం

SRCL: వేములవాడ రాజన్న క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమం 16వ రోజు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా నిత్యం ఆలయాల ఆవరణలో దీపోత్సవం నిర్వహించాలని దేవాదాయ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు భీమేశ్వరాలయం ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ ఏఈవో అశోక్ కుమార్ దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.