నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
కోనసీమ: మలికిపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలు మరమ్మతు పనుల కారణంగా కరెంటు సరఫరా నిలిచిపోతుందన్నారు. మలికిపురం, విశ్వేశ్వరాయపురం, ఉయ్యూరి వారి మెరక, కేడీ పాలెం, అంతర్వేది గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోతుందన్నారు.