యూడీఐడీ సదరం షెడ్యూలు విడుదల

SRD: మే నెలకు సంబంధించిన యూడీఐడీ సదరం షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం తెలిపారు. సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 8, 13, 16, 20, 23, 27 తేదీలో జరుగుతుందని చెప్పారు. మీ-సేవ ద్వారా నిరంతరం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. స్లాట్ బుకింగ్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలన్నారు.