మొదటి రోజు 91.29శాతం పంపిణీ
ASR: జిల్లాలో మొదటి రోజైన బుధవారం 91.29శాతం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. జిల్లాలో మొత్తం 73,862 మంది లబ్ధిదారులకు రూ.31.26కోట్లను పంపిణీ చేయాల్సి ఉండగా, రూ.28.53కోట్లు అందించడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీలో అల్లూరి జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా చర్యలు చేపట్టామన్నారు.