చాలా సంతోషంగా ఉంది: నటి మాళవిక
నటి మాళవిక మోహన్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆమెకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. తొలిసారి తిరుమల రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.