పోలీస్ శాఖ ఆద్వర్యంలో 2K రన్ కార్యక్రమం
BDK: చర్లలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆద్వర్యంలో శుక్రవారం 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్ పెట్రోల్ బంక్ ప్రాంతం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో CI రాజు పాల్గొని మాట్లాడారు. దేశానికి వల్లభ్‌భాయ్ పటేల్ చేసిన సేవలు మరవలేమని, దేశ ఐక్యతలో ఆయన పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా యువకులు, స్థానికులు పాల్గొన్నారు.