ఈనెల 5న మండల పరిషత్ సమావేశం: ఎంపీడీవో
ELR: ఉంగుటూరు మండలం సర్వ సభ్య సమావేశం ఈనెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక మండల పరిషత్ హాలులో జరుగుతుందని ఎంపీడీవో మనోజ్ తెలిపారు. ఆ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని శాఖల మండల శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.